- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమన్యం మానవత్వం మరిచింది. అంబులెన్స్ రాకముందే మృతదేహాన్ని రిక్షాలో ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఈ వీడియో చిత్రీకరించిన మీడియాపై ఆస్పత్రి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలువల కంటే ఆస్పత్రులు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు.
- Advertisement -