ఢిల్లీ: ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు తనలో భయాందోళనలు ఉండేవని హీరోయిన్ సమంత తెలిపారు. తన స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని, శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు లెక్కపెట్టుకుంటూ ఉండేదానని వివరించారు. మయో సైటిస్ తనకు ఎన్నో నేర్పడంతో పాటు తనలో పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంతా మాట్లాడారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడదలైన సందర్భాలు ఉన్నాయని, ఇదే విజయమని అనుకున్నానని పేర్కొన్నారు. విరామం లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానని, వరసగా సినిమాలు చేయడంతో పాటు బ్లాక్బస్టర్లలో నటించాలని, టాప్ టెన్ హీరోయిన్ల లిస్ట్‌లలో తన పేరు ఉండాలనే కసితో పని చేసేదానని సమంత వివరించారు.
Also Read: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్
తన ఫాలోవర్స్ చాలామంది తన గ్లామర్ సినిమాలతో తనని ఫాలో అవుతున్నారని తనకు తెలుసునన్నారు. తన ఆత్మగౌరవం నంబర్ల మీద ఉందనుకున్నానని చెప్పారు. రెండు సంవత్సరాల నుంచి తన సినిమాలు విడుదల కావడంలేదని, తాను టాప్ టెన్ లిస్ట్‌లో లేనని, తన వద్ద రూ.1000 కోట్లు సినిమాలు కూడా లేవన్నారు. ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన అభిమానుల కోసం గత సంవత్సరం నుంచి హెల్త్ పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తున్నానని, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్న ఎక్కడో వెతికే అవసరం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని సమంత తెలియజేశారు. దర్శకుడు రాజ్, డికె తెరకెక్కిస్తున్న రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ సినిమాలో సమంతా నటిస్తున్నారు. సమంతకు తోడుగా ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు.