హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష నిర్వహించాలని కెటిఆర్ కోరారు. పరీక్షల్లో అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ వేసి దొంగలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని మండిపడ్డారు. ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాల హామీపై అసెంబ్లీ ఏర్పాటు చేసి చర్చించాలని కెటిఆర్ సవాల్ విసిరారు.
Also Read : డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు