లక్నో: కాలేజీ హాస్టల్ రూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక ఎంబిఎ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి త్రీవంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ కుమార్(22) యుపిలో బిమ్ టెక్ కాలేజీలో ఎంబిఎ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఆగ్రా చెందిన దేవాన్షు చౌహాన్ పిజిడిఎం చదువుతున్నాడు. ఇద్దరు కాలేజీకి సంబంధించిన ఆర్ సిఐ విద్యావిహార్ హాస్టల్‌లో ఉంటున్నారు. రూమ్‌లో దేవాన్షు, దీపక్ రక్తపు మడుగులో కనిపించడంతో సహా విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
దీపక్ అప్పటికే మృతి చెందగా దేవాన్షు తీవ్రంగా గాయపడ్డారని కైలాష్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దేవాన్షులు తండ్రి మాజీ పోలీస్ అధికారిగా గుర్తించారు. తన తండ్రి లైసెన్స్ తుపాకీతో దేవాన్షు హాస్టల్ రూమ్ తీసుకోచ్చాడు. దీపక్ కుమార్‌పై కాల్పులు జరిపిన తరువాత దేవాన్షులు కాల్చుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రూమ్ లో బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్యాంపస్‌కు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఈ సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉందని, న్యాయం జరిగేందుకు తమ సంస్థ తరపున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.