అమరావతి: తండ్రి బాలుడిని చంపి అనంతరం భార్యను చంపబోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవనకొండలో నరేష్, శ్రావణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. పొలం వద్ద కుమారుడిని చంపేసి నీటి డ్రమ్ములో పడేశాడు. అనంతరం భార్య శ్రావణిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అత్తమామలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగినట్టు సమాచారం. గతంలో ఫస్ట్ భార్యను కూడా వేధించడంతో ఆమె చనిపోయిందని గ్రామస్థులు వాపోయారు.
Also Read: డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు