Thursday, September 11, 2025

42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గవర్నర్ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం ర్యలు తీసుకున్న విషయం విధితమే. బిసిల రిజర్వేషన్‌లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్ గా, ఎంపిపి, జడ్పీటిసి ఎన్నికలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నారు.

Also Read: బిసి కోటాకు ఆర్డినెన్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News