Friday, September 12, 2025

శుక్రవారం రాశిఫలాలు (12-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు, వ్యూహ ప్రతి వ్యూహాలు, ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి.

వృషభం – మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. విందులు వినోదాలు విహారయాత్రలకు దూరంగా ఉండటం చెప్పదగినది.

మిథునం – వ్యూహాత్మకమైన విషయాలు లాభిస్తాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్యాంకు లోన్లు తీసుకుంటారు.

కర్కాటకం – ఏకాంతంగా జరిగిపోయిన కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. కొన్ని విషయాలను డైరీలో భద్రపరుస్తారు. ఎదుటి వాళ్ళను అంచనా వేయడంలో దాదాపుగా పొరపాటు పడరు.

సింహం – మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు.  అవసరమైన వ్యక్తులను, స్వార్ధపరులను చేరదీసినందుకు విచారిస్తారు.

కన్య –  అందరూ మనవాళ్లే కదా అని భావిస్తారు. ఇందువల్ల కొంత ఇబ్బంది పడతారు. సమాజం పోకడ పూర్తిగా అర్థమవుతుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది.

తుల – వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోగలుగుతారు. కాంట్రాక్టులు లాబిస్తాయి. సంతాన పురోగతి గురించి వాళ్ళ క్రమశిక్షణ గురించి శక్తికి మించి ఖర్చు చేస్తారు.

వృశ్చికం – ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మిత్ర బృందాన్ని విస్తరింప చేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో సఖ్యత పెంచుకోవడం మంచిదని భావిస్తారు.

ధనుస్సు – కొంతమంది మీకు నమ్మక ద్రోహం చేసిన అది ఎవరికి చెప్పరు. లోపం లేని మనిషి ఉండడని సరిపెట్టుకొని సన్మార్గంలో నడవమని హెచ్చరించి వదిలేస్తారు.

మకరం – క్రమశిక్షణతో పొదుపు పథకాలను అమలుపరిచి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తారు.దుర్వ్యసనాల ప్రభావం, స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది. తగిన జాగ్రత్త వహించాలి.

కుంభం – మార్కెట్లో మీకు రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. మీరు చెల్లించాల్సిన చోట ఇబ్బందులు లేకుండా కొంత డబ్బుని సర్దుబాటు చేస్తారు. కుటుంబంలో మరో కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది.

మీనం – సహాయం చేసిన వాళ్ళు మీ ఎదుట అంతా మర్చిపోయినట్లుగా నటించే వ్యక్తులు మీ ఆగ్రహానికి కారణం అవుతారు. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవే పెరిగి పెరిగి కొండలాంటి సమస్యలుగా తయారవుతాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News