- Advertisement -
అమరావతి: ఎపిలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే 96.5 శాతం ఇకెవైసికి అర్థం (“ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్”) ఇది ఒక డిజిటల్ ప్రక్రియ. చేసిన ఏకైక రాష్ట్రం ఎపి అని నాదెండ్ల కొనియాడారు. ఈ నెల 15 నుంచి అన్నిజిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే.. కార్డు రద్దు అవుతుందని, వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Also Read : ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు: గొట్టిపాటి
- Advertisement -