- Advertisement -
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలోని పురాతన గది పై కప్పు కూలింది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కలెక్టర్ వెనుక భాగం కూలిపోయింది. అతి పురాతన నిజాం కాలం నాటి భవనం ఉండడం వల్ల కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేక పోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జిల్లా పాలనాధికారి ఉండే, జిల్లాకు సంబంధించి వివిధ రికార్డులు భద్ర పరిచే కార్యాలయాన్ని పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టి లో పెట్టుకుని పాత భావనానికి మరమ్మతులు చేయించకపోవడం కొసమెరుపు.
- Advertisement -