Friday, September 12, 2025

నూతన మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం, 2025 బిల్లును గవర్నర్ ఆమోదించి గురువారం సంతకం చేశారు. ఈ బిల్లులో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటి పరిధిలోని ఇబ్రహీంపేట ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ బిల్లును శాసనసభ, మండలి ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపడంతో ఇప్పుడు ఆమోదం జరిగింది. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Also Read: మెదక్‌లో భారీ వర్షం

రిజర్వేషన్ల సడలింపు బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోలేదు: రాజ్‌భవన్

కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సడలింపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడో సవరణ) చట్టం, 2025 బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతాన్ని ఎత్తివేస్తూ ఉభయ సభలు ఆమోదించిన బిల్లు ఇంకా గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన ‘పంచాయతీరాజ్ చట్టం -2018’లోని సెక్షన్ 285 (ఏ)కు, మున్సిపల్ చట్టం- 2019లోని సెక్షన్ 29కు సవరణ చేస్తూ రెండు బిల్లులను ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కార్యాలయానికి ఆమోదం కోసం పంపించింది. ఈ బిలుల్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్‌భవన్ వెల్లడించింది. అయితే ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News