దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒమన్‌తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 ఫార్మాట్లో పాక్ చాలా మెరుగైన జట్టుగా పేరు తెచ్చుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.
సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లు లేకుండానే పాకిస్థాన్ ఆసియా కప్‌లో బరిలోకి దిగుతోంది. సల్మాన్ ఆఘా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఫహీం అశ్రఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ నవాజ్, సైమ్ అయుబ్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది తదితరులతో పాకిస్థాన్ చాలా బలంగా ఉంది. ఫకర్ జమాన్, అబ్రార్ అహ్మద్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, హారిస్ రవూఫ్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు దుబాయి పిచ్‌పై పాకిస్థాన్‌కు మంచి ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న పాకిస్థాన్ ఆసియాకప్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా రానున్న భారత్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది.
భారీ ఆశలుతో..
మరోవైపు ఒమన్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. పాకిస్థాన్ గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, హమ్మాద్ మిర్జా, ఆశీశ్, అమీర్ కలీం, షకీల్ అహ్మద్, హస్నైన్ షా, ఇమ్రాన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఇందులో ఏ ఇద్దరు రాణించినా పాకిస్థాన్‌కు కష్టాలు ఖాయమనే చెప్పాలి. అయితే పాకిస్థాన్‌తో పోల్చితే ఒమన్‌కు అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం చాలా తక్కువ. ఇలాంటి స్థితిలో ఈ పోరు ఒమన్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి.
Also Read: ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్ హవా