బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ’కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “నిర్మాత సాహుతో కలిసి భగవంతుకేసరి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో సినిమా ఆయన నిర్మాణంలోనే చేస్తున్నాను. మా సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయ్యే ముందే కిష్కింధపురి సినిమా హిట్ అయి నాకు మంచి గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను” అని తెలిపారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చాలా కష్టపడి చేశాం. భయపెట్టడం కూడా ఒక ఆర్ట్. కిష్కింధపురి సినిమాతో ఆడియన్స్‌ని భయపెడతాం. దర్శకుడు కౌశిక్ ఈ సినిమాతో చాలా మంచివి స్థాయికి వెళ్తారు” అని అన్నారు.
ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ “హారర్ సినిమాలో చాలా వస్తుంటాయి. కానీ ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉంది. సినిమా హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉంటుంది” అని తెలియజేశారు. డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.