- Advertisement -
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి కష్టసమయంలో బాధితులను పరామర్శించడానికి వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -