Friday, September 12, 2025

అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : పోలీసులకు అందే ప్రయోజనాలన్నీ అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వే లు నగదు పురస్కారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పిం చిన అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని ఆమె గు ర్తు చేశారు. గురువారం నగరంలోన నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ,

ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మ ద్ నదీమ్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొ ని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొం డా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని సూచించారు. విధి ని ర్వహణలో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రా ష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్ర భుత్వం అండగా
ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

ఆ కార్యక్రమంలో చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పిసిపిఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డిసిపి స్నేహామెహరా, అడిషనల్ పిసిపిఎఫ్ లు సి. శరవనణ్, , ప్రియాంకవర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరెమత్, క్యూరేటర్ జె. వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లు యన్. క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జిహెచ్‌ఎంసి అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ వివిఎల్. సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెట్) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ మల్ దొడ్డి బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్ లు ఎ. శంకరణ్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ. నాగమణి, అసిస్టెంట్ క్యూరేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, డిఆర్‌ఓలు మాదవీలత,కరుణాకర్, ఎఫ్‌ఎస్‌ఓలు వెంకట్ రావు, మంజుల, పిఆర్ ఓ హనీఫ్ ఉల్లా, జడ్‌ఈఓ దీపక్,జూ పరిపాలన విభాగం అధికారులు ఖుద్దుస్, పిఎస్ ఎన్ శ్రీనివాస్, లీయాకత్ హుస్సేన్ , జూ సార్జెంట్ ఎంఎ. రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News