హాంగ్‌జౌ: మహిళల ఆసియా కప్‌లో భాగంగా గురువారం చైనాతో జరిగిన సూపర్ 4 రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చైనా 4-1 గోల్స్ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే చైనా దూకుడుగా ఆడింది. ఆట నాలుగో నిమిషంలోనే జౌ మిరాంగ్ చైనాకు తొలి గోల్ సాధించి పెట్టింది. తర్వాత కూడా చైనా గోల్స్ కోసం తీవ్రంగా పోరాడింది. కానీ చాలా సేపటి వరకు బారత క్రీడా కారిణిలు చైనాకు మరో గోల్ లభించకుండా అడ్డుకున్నాడు. కానీ 31వ నిమిషంలో చెన్ యంగ్ చైనా తరఫున రెండో గోల్‌ను నమోదు చేసింది. కాగా, 38వ నిమిషంలో భారత స్టార్ క్రీడాకారిణి ముంతాజ్ ఖాన్ భారత్‌కు తొలి గోల్‌ను అందించింది. ఇక 47వ నిమషంలో టన్ జిహువాంగ్ చైనా తరఫున మూడో గోల్‌ను సాధించింది. అంతేగాక 56వ నిమిషంలో జౌ మిరాంగ్ తన రెండో గోల్‌ను నమోదు చేసింది. దీంతో చైనా ఆధిక్యం 4-1కి చేరింది. దీన్ని చివరి వరకు కాపాడుకోవడంలో సఫలమైన చైనా ఘన విజయం సాధించింది.
మహిళల ఆసియా కప్.. చైనా చేతిలో భారత్ ఓటమి
- Advertisement -
- Advertisement -
- Advertisement -