Friday, September 12, 2025

ఆసియా కప్ 2025: హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా గురువారం హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన బంగ్లా జట్టు 17.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.  బంగ్లా బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ లిటన్ దాస్(59) అర్ధ సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు తౌహిద్ హృదోయ్(35 నాటౌట్) రాణించాడు. దీంతో మెగా టోర్నీలో బంగ్లాదేశ్ బోణి కొట్టింది.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హాంకాంగ్‌కు ఓపెనర్ జిషాన్ అలీ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జిషాన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. బాబర్ హయాత్ (14) అతనికి అండగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ యాసిమ్ ముర్తుజా 19 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన నిజాకత్ ఖాన్ 42 పరుగులు చేశాడు. దీంతో హాంకాంగ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్, ముస్తఫిజుర్, రిషాద్ హుస్సేన్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News