Friday, September 12, 2025

పెట్టుబడులను రెట్టింపు చేసిన ఆక్సిలో ఫిన్‌సర్వ్

- Advertisement -
- Advertisement -

విద్యపై దృష్టి సారించిన ప్రముఖ NBFC, ఆక్సిలో ఫిన్‌సర్వ్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తమ సిఎస్ఆర్ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎడివేట్ సిఎస్ఆర్ పథకం కింద ఆక్సిలో యొక్క ప్రధాన కార్యక్రమం అయిన ‘ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన (ఈడబ్ల్యుఎస్) విద్యార్థులకు మరియు అసాధారణ విద్యా సామర్థ్యం/పనితీరు కలిగిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కంపెనీ ఆర్థికంగా మద్దతు అందిస్తుంది.

ఆర్థిక సంవత్సరం 2024-25లో, ఎడివేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ రూ. 95 లక్షలకు పైగా స్కాలర్‌షిప్‌లకు అందించింది. తద్వారా భారతదేశంలో 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ , నైపుణ్యాభివృద్ధి కోర్సులను అభ్యసించడానికి వీలు కల్పించింది. ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద, చక్కటి విద్యా ప్రదర్శన కనబరిచిన అర్హులైన విద్యార్థులు సెమిస్టర్‌కు రూ. 1,00,000 వరకు స్కాలర్‌షిప్‌లను అందుకోగలరు.

ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ – ప్రధాన ఆకర్షణలు :

* స్కాలర్‌షిప్ మొత్తం: సెమిస్టర్‌కు రూ. 1,00,000 వరకు.

* అర్హత: సమాజంలోని ఈడబ్ల్యుఎస్ విభాగంకు చెందిన విద్యార్థులు మరియు మెరిట్ ఆధారిత అర్హులైన విద్యార్థులు.

* వార్షిక కుటుంబ ఆదాయం: రూ. 7,00,000 మించకూడదు.

* ఈ పథకం వర్తించేది: ఏఐసిటిఈ, యుజిసి, నాక్ , లేదా ఎన్ బిఏ ద్వారా గుర్తించబడిన పూర్తి-సమయం యుజి /పిజి కోర్సులు.

* విద్యా అర్హత: గత విద్యా సంవత్సరంలో కనీసం 70% మార్కులు.

* వయోపరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు.

ఆక్సిలో ఫిన్‌సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ నీరజ్ సక్సేనా మాట్లాడుతూ “సామాజిక పరివర్తనకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా, మేము పేద యువతకు వారు కోరుకున్న విద్యను అభ్యసించడానికి మరియు పూర్తి చేయడానికి తగిన అవకాశాన్ని అందించడం ద్వారా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం కేవలం ఆర్థిక సహాయం గురించి మాత్రమే కాదు, జీవితాలను మార్చడం గురించి…” అని అన్నారు.

ఆక్సిలో తమ పరిధిని విస్తృతం చేయడానికి, గ్రామీణ , వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులు మరియు విభిన్న నేపథ్యాలకు చెందినప్పటికీ విద్యాపరంగా ప్రతిభావంతులైన విద్యార్థులు సహా అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు చేరేలా చూసుకోవడానికి Buddy4Study మరియు BIRDS (బీజాపూర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ) వంటి విద్య-కేంద్రీకృత ఎన్జీఓ లతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.

స్కాలర్‌షిప్‌లు నిజంగా అర్హులైన అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవడానికి గృహ సందర్శనలతో సహా బలమైన ధృవీకరణ ప్రక్రియను ఆక్సిలో అనుసరిస్తుంది. దీనికోసం ఆక్సిలో బృందం పరిశ్రమలో మొట్టమొదటి సారిగా అంతర్గత ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది, ఇది విద్యార్థులు సమర్పించిన సమాచారాన్ని తనిఖీ చేసి ధృవీకరిస్తుంది. నిష్పాక్షికమైన రీతిలో విద్యార్థుల ఎంపికను చేయటానికి సామాజిక ప్రభావ స్కోర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విద్యార్థులు https://www.auxilo.com/Impactx-scholarship/ ని సందర్శించి అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం, ఆర్థిక అవరోధాలను తొలగించటం, ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీల నుండి యువతను శక్తివంతం చేయడం ద్వారా విద్యతో సామాజిక ప్రభావాన్ని సృష్టించాలనే ఆక్సిలో యొక్క దీర్ఘకాలిక లక్ష్యంను ప్రతిబింబిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News