350 సిసి కంటే తక్కువ గల మోటార్ సైకిల్స్ పై 28% నుండి 18%కి GST రేటు తగ్గుదల ప్రపంచంలో అతి పెద్ద టూ-వీలర్ మార్కెట్ లో, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్, సంబంధిత లక్ష్యభరితమైన ప్రజలు భారీ లాభం పొందుతారు.
ప్రధానాంశాలు:
జావా యెజ్డీ మోటార్ సైకిల్స్–అతి పెద్ద విజేతలు: 350 సిసి లోపు మోటార్ సైకిళ్ల కోసం GST 18 శాతంకి తగ్గడంతో, ఆశావాహ మరియు వాస్తవమైన హెరిటేజ్ జావా మరియు యెజ్డీ మోటార్ సైకిళ్లు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి, క్లాసిక్ లెజెండ్స్ తగ్గించబడిన 100% పన్ను ప్రయోజనాన్ని వినియోగదారులకు గర్వంగా అందచేస్తున్నారు.
ఇంజన్స్ ప్లాట్ ఫాంస్: జావా యెజ్డీ మోటార్ సైకిళ్లకు 293 సిసి మరియు 334 సిసి ఆల్ఫా 2 లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది, 334 సిసి ఆల్ఫా 2 29PS మరియు 30Nm టార్క్ తో తన సహచరులను అధిగమిస్తోంది.
యజమానికి హామీ: పరిశ్రమలో నాయకత్వంవహించే 4 సంవత్సరాలు/50,000 కిమీ వారంటీ ద్వారా మద్దతు చేయబడిన మోటార్ సైకిళ్లు మరియు భారతదేశంవ్యాప్తంగా 450కి పైగా సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్లతో సాటిలేని మనశ్సాంతి పొందడానికి సమగ్రమైన నిర్వహణ ప్రణాళికను చేసింది; GST 2.0 సంస్కరణలు జావా యెజ్డీ పోషకుల కోసం యాజమాన్య ఖర్చును కూడా తగ్గించాయి
9 సెప్టెంబర్, ముంబయి: జావా యెజ్డీ మోటార్ సైకిళ్లు ద్వారా విజయవంతమైన పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ శ్రేణి కోసం క్లాసిక్ లెజెండ్స్ (CL) కొత్త ధరల్ని ప్రకటించింది. వాటిలో అడ్వంచర్, రోడ్ స్టర్, బోబ్బర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఇప్పుడు రూ. 2 లక్షల లోపు లభిస్తున్నాయి.
దశాబ్దాల క్రింద, ఒక పాలసీలో మార్పు 2-స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించింది, పర్యావరణానికి తగినది కాదని భావించింది, తమ శ్రేణిలో అప్పట్లో మార్కెట్ నాయకులుగా నిలిచిన జావా మరియు యెజ్డీల ప్రయాణాన్ని భారతదేశంలో ఆపుచేసింది. ఈ నెల, మరొక ప్రగతిశీలకమైన పాలసీ మార్పు వాటిని కేంద్ర స్థానంలోకి పునరుద్ధరించింది. GST 2.0 సంస్కరణలతో, జావా మరియు యెజ్డీలు ప్రజల పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ గా మళ్లీ పునః జన్మించాయి, మరొకసారి భారతదేశపు మోటార్ సైక్లింగ్ సంస్కృతికి నాయకత్వంవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని జావా, యెజ్డీ మోటార్ సైకిళ్లకు 293 సిసి లేదా 334 సిసి ఆల్ఫా 2 లిక్విడ్-కూల్డ్ ఇంజన్ లు ఉన్నాయి, రెండోది తమ సహచరులను 29 PS మరియు 30 Nm టార్క్ తో అధిగమిస్తోంది.
“ప్రభుత్వం యొక్క సాహసోపేతమైన మరియు సకాలంలో చేసిన GST సంస్కరణలు ఉత్తమమైన మంచి చేయడానికి గొప్ప మార్పును తెస్తుంది, 2 –స్ట్రోక్స్ నుండి 4 స్ట్రోక్ ఇంజన్లకు చారిత్రక పరివర్తనను సూచిస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ GST పునర్నర్వ్యస్థీకరణను ప్రత్యేకించి 350-సిసి మోటార్ సైకిల్స్ కోసం తగ్గించబడిన 18 శాతం రేటును స్వాగతిస్తోంది. ఇది మా 293 సిసి మరియు 334 సిసి జావా మరియు యెజ్డీ పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ ను కవర్ చేస్తుంది,” అని అనుపమ్ తరేజా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ-స్థాపకులు అన్నారు. “మా 652 సిసి BSA గోల్డ్ స్టార్ వంటి అత్యధిక సిసి మోటార్ సైకిళ్ల కోసం పన్ను భారాన్ని ఇది పెంచగా, మేము దీనిని ప్రగతిశీలకమైన పన్ను యొక్క హాల్ మార్క్ గా ఆమోదించాము. ట్రేడ్-ఆఫ్ మధ్యస్థ-శ్రేణి బైక్స్ ను విస్తృతమైన రైడర్ కమ్యూనిటీకి అందుబాటులో ఉంచింది- భారతదేశపు మోటార్ సైక్లింగ్ సంస్కృతికి ఇది గెలుపు. ఆర్థిక మాంద్యం మరియు ప్రపంచ సుంకాల యుద్ధాల మధ్య డిమాండ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రికి మేము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. దశాబ్దాల క్రితం, పాలసీలో మార్పు కారణంగా మా బ్రాండ్లు డిమాండ్ ను కోల్పోయాయి. ఈరోజు, GST మా కస్టమర్లకు ప్రయోజనం కలిగిస్తోంది, పండగ సీజన్ సమయంలో ఈ మార్పు కలిగిన కారణంగా, నిజమైన దిగ్గజపు పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవాలని కోరుకునే భారతీయ యువతకు మేము చెబుతున్నాం. ఇప్పుడు మీ సమయం ఆరంభమైంది,” అని ఆయన అన్నారు.
దిగ్గజపు క్లాసిక్ మోటార్ సైకిల్ భారతీయ యువతకు గతంలో కంటే మరింత అందుబాటులో ఉంచిన ధరలతో, జావా యెజ్డీ మోటార్ సైకిళ్లు శ్రేణిలో – గొప్ప డిజైన్లు, ప్రపంచ స్థాయికి చెందిన ఇంజనీరింగ్, మరియు భారతదేశపు రహదారుల కోసం అనుకూలం చేయబడిన పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో జావా యెజ్డీ మోటార్ సైకిళ్లు అత్యంత ఫ్యాషన్ రెట్రో మెషీన్లను మళ్లీ తీసుకువస్తున్నాయి.
మనశ్సాంతికి హామీ: క్లాసిక్ లెజెండ్స్ తమ పోషకులకు ఆఫ్టర్-సేల్స్ భాగాల్లో GST 2.0 తగ్గింపు యొక్క పూర్తి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రధానంగా సొంతం చేసుకునే యాజమాన్యపు ఖర్చును తగ్గిస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ కి చెందిన అన్ని మోటార్ సైకిళ్లు ఈ శ్రేణిలో పరిశ్రమలో-తొలి కార్యక్రమం ‘జావా యెజ్డీ BSA యాజమాన్యం అష్యూరెన్స్ ప్రోగ్రాం’ ద్వారా మద్దతు చేయబడతాయి.
సమగ్రమైన కార్యక్రమంలో 4-సంవత్సరాలు/50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ, ఆరు సంవత్సరాల వరకు దీర్ఘకాల కవరేజ్, ఒక ఏడాది వరకు రోడ్ సైడ్ సహాయం ఆప్షన్స్ ఉన్నాయి మరియు యాజమాన్య ప్రయోజనాల శ్రేణి తమ ఇంజనీరింగ్ శ్రేష్టత మరియు తమ మెషీన్ల యొక్క దీర్ఘకాలం నమ్మకంలో కంపెనీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. ఈ హామీ కార్యక్రమం కంపెనీ వారి అన్ని సేల్స్ మరియు సర్వీస్ నెట్ వర్క్ టచ్ పాయింట్లలో లభిస్తోంది, సులభంగా పొందడానికి మరియు నిర్వహణ కోసం ఇవి ఇప్పుడు రెట్టింపుగా మారి 450కి పైగా ఉన్నాయి.