Friday, September 12, 2025

నేడు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌తో పదవీ ప్రమాణస్వీకారం చేయించనున్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 67 ఏళ్ల రాధాకృష్ణన్ మం గళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారన్నది తెలిసిన విషయమే. జగ్దీప్ ధనఖడ్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పలేదు. మహారాష్ట్రలో గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వహించడానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌ను రాష్ట్రపతి ముర్ము నియమించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక సి.పి.రాధాకృష్ణన్ గురువారం తన మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను వదులుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News