Friday, September 12, 2025

పిఎంకెలో రచ్చకెక్కిన కుటుంబ కలహాలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ‘పాటాలి మక్కల్ కచ్చి’(పిఎంకె) పార్టీలో చిచ్చు మరింత తీవ్రమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామ్‌దాస్ గురువారం తన కుమారుడు అన్బుమణి రామ్‌దాస్‌ను ‘రాజకీయంగా అసమర్థుడు’ అని పేర్కొంటూ పార్టీ నుంచి తొలగించారు. పార్టీ పంపించిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పిఎంకెను స్థాపించింది తానేనని, తన నిర్ణయమే తుది నిర్ణయం అని, దానిని ఎవరూ వీటో చేయలేరని రామ్‌దాస్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఉండాలనుకుంటే అన్బుమణి స్వంతంగా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. ‘అన్బుమణి పిఎంకెను నాశనం పట్టిస్తున్నారు. అతడు రాజకీయంగా అసమర్థుడు. పైగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. నా మద్దతు లేకుంటే అతడు నేడు ఈ స్థాయిలో ఉండేవాడే కాదు. పిఎంకెకు చెందిన ఎవరూ కూడా అన్బుమణితో సంబంధాలు పెట్టుకోకూడదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News