Friday, September 12, 2025

బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో సమీపంలోని కోకరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు హర్దోయ్ నుంచి కైసర్‌బాఘ్ వెళ్తుండగా బ్రిడ్జి పైనుంచి 20 అడుగుల లోతులో పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. గాయపడిన వారిలో ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Also Read: అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News