అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల లోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill). 2019లో వన్డే జట్టులో, 2020లో టెస్టుల్లో అడుగు పెట్టిన గిల్.. తాజాగా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించి.. సిరీస్‌ని 2-2గా సమం చేశాడు. అంతేకాక.. తాజాగా ఆసియాకప్ కో్సం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే తనకు ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మార్గదర్శకులని గిల్ వెల్లడించాడు. తాను క్రికెటర్‌గా మారేందుకు కారణమైన దిగ్గజాల గురించి చెప్పాడు. తన తండ్రికి సచిన్ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే తనని కూడా క్రికెటర్ చేశారని అన్నాడు. ఇక కోహ్లీ నిబద్ధత తనకు స్ఫూరి అని పేర్కొన్నాడు.
‘‘టాలెంట్, నైపుణం ఉంటే సరిపోదు.. ఆడాలనే తపన, అభిరుచి లేకపోతే.. సక్సెస్ కాలేవు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ నా స్పూర్తి. ప్రశంసల గురించి పట్టించుకోను. నా బాధ్యతలు ఎలా నెరవేర్చాలో అని ఆలోచిస్తా. సచిన్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. నేను క్రికెటలో రావాడానికి కారణం అదే. సచిన్ 2013లో రిటైర్ అయితే.. నేను 2011-13 మధ్య క్రికెట్ ఆడటం ఎలాగో అర్థం చేసుకున్నా. కేవలం నైపుణ్యమే కాకుండా.. మానసికంగా, వ్యూహాత్వకంగా గేమ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. విరాట్‌తో కలిసి ఆడే అవకాశం రావడంతో అతన్ని దగ్గర నుంచి గమనించే అవకాశం కూడా వచ్చింది. నిజంగా అతడి నిబద్ధత చాలా గ్రేట్’’ అని గిల్ (Shubman Gill) వివరించాడు.
Also Read : ఆసియా కప్ 2025: హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ