Friday, September 12, 2025

కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కంగనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది కేవలం రీట్వీట్ కాదని.. దీనికి మసాలా జోడించారు’’ అంటూ ధర్మాసనం చీవాట్లు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

అసలు జరిగిందేంటంటే.. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో దేశ రాజధానిలో రైతు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మహీందర్ కౌర్ అనే వృద్ధ మహిళను కించపరిచేలా ఉన్న ట్వీట్‌ని కంగనా (Kangana Ranaut) రీట్వీట్ చేశారు. ఇది కాస్త తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై కంగనా మహీందర్ కౌర్ కంగనాపై పరువు నష్టం కేసు వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కంగనా హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. దీంతో హర్యానా న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ, ఇక్కడ కూడా ఆమెకు నిరాశ తప్పలేదు.

Also Read : ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News