ముంబై: స్పైస్‌జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే అప్పటికీ ప్రయాణం కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి ఊడి రన్‌వేపై పడిపోయింది. వెంటనే విమానం నుంచి ఏదో పడిపోయినట్లు గుర్తించిన ఎయిర్‌పోర్టు టవర్ కంట్రోల్ అధికారులు.. రన్‌వే పైకి తనిఖీ బృందాలను పంపించారు. అది విమాన టైర్ అని తెలియడంతో అప్రమత్తమై… ముంబై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. కుడివైపు ఉన్న రెండు టైర్లలో ఒకటి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పైస్‌జెట్ (Spicejet) విమానయాన సంస్థ విమానం సొంతశక్తితోనే టర్మినల్‌కు చేరుకుందని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.
Also Read : సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు