విత్తన రంగంలో పరస్పర సహకారంతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీడ్ సమ్మిట్‌లో పాల్గోనేందుకు వచ్చిన ఆఫ్రికన్ ప్రతినిధులు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయ రంగం, విత్తనోత్పత్తి రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను, విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సాధించిన విజయాలు మంత్రి వెల్లడించారు. దేశం అవసరాల కోసం రాష్ట్రం విత్తన హబ్‌గా రూపుదిద్దుకుందని, 60 శాతం విత్తనాలు రాష్ట్రం నుంచే వెళుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆఫ్రికన్ ప్రతినిధులకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో విత్తన రంగంలో సహకారాన్ని పెంపోందించుకోవాలని ఆఫ్రికన్ ప్రతినిధులు ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు.
Also Read: టాలెంట్ ఉంటే సరిపోదు.. అవి ఉంటేనే సక్సెస్..: గిల్