Friday, September 12, 2025

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

- Advertisement -
- Advertisement -

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియామకాలు సరైన విధంగా జరగలేదని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు 1 నిర్వహించగా, అది కూడా అనేక అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో గత బిఆర్‌ఎస్ వైఫల్యం చెందినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైందని ఆయన విమర్శించారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన, నిరాశకు లోనవుతున్నారని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే మొదటి ఏడాది రెండు లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీని నిరవేర్చలేదన్నారు. అభ్యర్థుల మనోభావాలను దృష్టిల పెట్టుకుని తిరిగి గ్రూపు 1 పరీక్షను నిర్వహించాలని మాజీ ఎంపి బూర డిమాండ్ చేశారు.

Also Read: కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపండి:రాంచందర్ రావు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News