రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందుకు నిరసనగా ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి తదితర 200 కళాశాలలు బంద్‌లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. ఈ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వృత్తి కాలేజీల బంద్‌పై శుక్రవారం ఫెడరేషన్ నాయకులు రమేష్, కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్ తదితరులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు.
Also Read: కామారెడ్డి కాంగ్రెస్ సభకు వర్షం దెబ్బ