2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిబిఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చడంలో పోలీసులు, సిబిఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలున్నాయి. ఇలా గతంలో ఆమెను రేప్, హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376,
సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబం ధించి ఇప్పుడు తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో ఆయేషా మీరా తల్లితండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయేషా మీరా తల్లితండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటికి తీసి రీపోస్టు మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లితండ్రు లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Also Read: గిరిజన సంక్షేమ శాఖకు రూ.11 కోట్లు విడుదల