Friday, September 12, 2025

టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని కాండ్లా విమానాశ్రయం నుంచి శుక్రవారం నాడు ముంబైకి వెళ్తున్న స్పేస్ జెట్ విమానం టేకాఫ్ సమయంలో ఒక చక్రం ఊడిపోయింది. అయితే, పైలెట్ లు విమానం ముంబై చేరిన తర్వాత సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలోని ఒక ప్రయాణీకుడు చక్రం ఊడిపోతున్న వీడియోను చిత్రీ కరించాడు. విమానం చక్రం పడిపోయిందని, అతడు పదేపదే చెప్పడం వీడియోలో విన్పించింది. క్యూ 400 టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్ వే పై దాని బయటచక్రం కన్పింంచినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. కాండ్లాలో టేకాఫ్, ముంబైలో ల్యాండింగ్ రెండూ సురక్షితంగా జరిగాయి. ముందు జాగ్రత్తగా, ముంబై విమానాశ్రయంలో తాత్కాలిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం టేకాఫ్ సమయంలో చక్రం ఊడిపోయిన విషయం తెలిసి ఆందోళన చెందిన ప్రయాణీకులు సురక్షితంగా ముంబైలో ల్యాండ్ కావడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News