- Advertisement -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంకు తోడు అల్పపీడన ప్రబావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: జిహెచ్ఎంసి, హైడ్రాకు హైకోర్టు నోటీసులు
- Advertisement -