Saturday, September 13, 2025

రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ జెండా ఎగురబోతోంది

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం హెచ్‌ఎంఎస్- సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవితను హెచ్‌ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ జెండా ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ… సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Also Read: టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం

ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని పేర్కొన్నారు. సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం అని తేల్చిచెప్పారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే సిబిఐకి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్‌ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హెచ్‌ఎంఎస్‌లో గౌరవాధ్యక్షురాలిగా తనను ఎన్నుకున్నారని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. హెచ్‌ఎంఎస్‌లో సభ్వత్యాలు పెంచాలి, శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందామని తెలిపారు. హెచ్‌ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయని చెప్పారు. హెచ్‌ఎంఎస్, జాగృతి కొత్త కాంబినేషన్… అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుందని అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News