బెంగళూరు: భర్త మరణిస్తే పెన్షన్ రావడంతో పులి దాడిలో చనిపోతే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ పడి భర్తను భార్య చంపి అనంతరం పెంటకుప్పలో పాతి పెట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిక్కహెజ్జూరు గ్రామంలో వెంకటస్వామి(54), సల్లాపురి(48) అనే దంపతులు నివసిస్తున్నారు. తన భర్త చనిపోతే పెన్షన్ వస్తుందిన భార్య సల్లాపుర ఆశపడింది. దీంతో భర్త పులి దాడి చనిపోయిందని భావిస్తే ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ప్లాన్ వేసింది.
Also Read: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
ప్లాన్లో భాగంగా భర్తకు ఆహారంలో విషం పెట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని లాక్కెళ్లి పెంటకుప్పలో పాతిపెట్టింది. పొలానికి వెళ్లినప్పుడు తన భర్తను పులి లాక్కెళ్లిందని గ్రామస్థులకు ముందూ ఏడుస్తూ నటించింది. దీంతో గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పులి ఆనవాళ్లు కనిపించలేదు. పోలీసులు గ్రామస్థులతో కలిసి వెంకటస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ పెంటకుప్ప దుర్వాసన రావడంతో తవ్విచూడగా మృతదేహం కనిపించింది. శవ పరీక్షలో విషాహారం తిని చనిపోయినట్టు తేలింది. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని వివరణ ఇచ్చింది. భార్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.