Saturday, September 13, 2025

మహిళలకు జిమ్ అవసరమా?

- Advertisement -
ఇప్పుడు మహిళలకు జిమ్ అనేది నగరాలలో కొత్తగా వస్తున్న సంస్కృతి.. వీరు కూడా మగవాళ్ళ కంటే తక్కువ కాదు అని సిక్స్ ప్యాక్స్ చేయాలి అనే విషయంలో పోటీ తత్వాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడం మహిళలకు (లేదా పురుషులకు) పూర్తిగా అవసరం లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రమం తప్పకుండా శారీరక శ్రమ,  దానిని అనేక విధాలుగా సాధించవచ్చు.
మహిళలకు వ్యాయామం ఎందుకు ముఖ్యం?
ఎముక ఆరోగ్యం, మహిళలు ఆస్టియోపొరోసిస్ బోలు ఎముకల వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
హార్మోన్ల సమతుల్యత, వ్యాయామం మానసిక స్థితిని నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఋతు ఆరోగ్యాన్ని మెన్సెస్ సైకిల్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణ, ఆరోగ్యకరమైన శరీర కూర్పును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒబిసిటీ అనేది మహిళలలో ఎక్కువగా ఉంటుంది ఇది రాకుండా వ్యాయామం అనేది ఆపుతుంది. గుండె ఆరోగ్యం,  మధుమేహం, రక్తపోటు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం నడుమునొప్పి, వెన్నునొప్పిని నివారిస్తుంది.
మరి జిమ్ అవసరమా?
అంటే అంతగా అవసరం లేదు. నడక, యోగా, సైక్లింగ్, నృత్యం, ఈత, ఇంటి వ్యాయామాలు లేదా ఇంటి శారీరక శ్రమ కూడా మహిళలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జిమ్ వ్యాయామాలు బలమైన కండరాల శిక్షణ, కార్డియోను నిర్ధారించడానికి ఒక నిర్మాణాత్మక, అనుకూలమైన మార్గం.
మరి జిమ్ ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది?
ఎవరైనా మిత్రులారా బాడీ కావాలని లక్ష్యంతో శిక్షణతో కండరాలను నిర్మించుకోవాలనుకుంటే లేదా శరీర ఆకృతిని మెరుగుపరచుకోవాలనుకుంటే వారు ప్రయత్నం చేయచ్చు. సినిమా యాక్టర్లు లాంటి వాళ్లకు, పోలీసు ఉద్యోగాలు లాంటి వృత్తిపరంగా మస్కులర్ బాడీ కావాలివారికి అవసరమైతే జిమ్ తప్పదు.
సంక్షిప్తంగా: వ్యాయామం అందరికీ అవసరం, జిమ్ అనేది ఐచ్ఛికం. ప్రతి స్త్రీ చురుకుగా ఉండాలి, కానీ జిమ్ తన జీవనశైలికి సరిపోకపోతే అవసరం లేకపోతే ఆమె నడక, యోగా, క్రీడలు లేదా ఇంటి పనుల ద్వారా తగినంత వ్యాయామాలను ఎంచుకోవచ్చు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News