Saturday, September 13, 2025

వలకు చిక్కిన అరుదైన చేప

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో లోయర్ మానేర్ డ్యామ్ లో వలకు అరుదైన భారీ చేప చిక్కింది. రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు రోజువారి లాగే చేపలు పట్టేందుకు శనివారం ఉదయం మానేరు డ్యామ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో తన వలలు తీస్తుండగా ఎర్ర రంగులో ఉన్న వెరైటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇట్లాంటి చేప ఇప్పటివరకు లోయర్ మానేరు రిజర్వాయర్ లో కనిపించలేదని మత్స్యకారులు తెలిపారు. ఇది ఉత్తర ప్రదేశ్ కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. ఈ వెరైటీ చేప చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.

Also Read: యూరియా వస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News