- Advertisement -
హైదరాబాద్: గ్రూప్-1 పోస్టులకు మంత్రులు, అధికారులు రూ. లక్షలు లంచం అడిగారని చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-1 పోస్టులకు రూ. లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలనుకోవడం సిగ్గు చేటు అని తప్పుదిద్దుకోకుండా అప్పీల్ కి వెళ్లాలనుకోవడం సరికాదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని, అసెంబ్లీలో నిలదీసి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
Also Read : హైదరాబాద్ మెట్రోలో ప్యాంట్ జిప్ తీసి..
- Advertisement -