మేషం: మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. క్రయవిక్రయాలు లాబిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి పితృకార్యక్రమాలు కూడా నిర్వహించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో సన్నిహితులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి అలాగే శని గ్రహ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా అరటి నారవత్తులతో దీపారాధన చేయండి. ఆరోగ్య పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని నూతన ప్రాజెక్టులు మీ చేతికి అందుతాయి. శుభకార్యాలు వాయిదా పడతాయి. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం కంటే కూడా ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేయండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో మరియు మంగళవారం శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మన మంచికే అన్నట్టుగా ఉంటాయి. మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం నెరవేరుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా పనిచేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నూతన కోర్సులు నేర్చుకుంటారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒక ప్రాజెక్టు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే పొదుపు ప్రయత్నాలు చేస్తారు. ప్రతి రోజు కూడా నాగ సింధూరం ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 4, కలిసివచ్చే రంగు ఎల్లో.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగ పరంగా అధికారులతో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు దేవీ నవరాత్రులలో కొనుగోలు చేయండి. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి. స్థిరాస్తులు అమ్మేసి రుణాలు తీరుస్తారు. మిగిలిన ధనంతో నూతన పెట్టుబడులు పెడతారు. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రే.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గతవారం కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీరు ఆశించిన మార్పులు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కలిసివచ్చే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మహాలయ పక్షాలు ముగిసిన తర్వాత వివాహానికి సంబంధించి మిగతా విషయాలు చర్చించుకోండి. పితృ కార్యక్రమాలు నిర్వహించండి, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కలుసుబాటు ఉంటుంది. వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం మంచిది. స్టాక్ మార్కెట్ కి షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. భూమికి సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్య రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ కొన్ని చికాకులు ఏర్పడతాయి.. సినిమా కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. చాలా వరకు సేవింగ్స్ కు ప్రాధాన్యత ఇస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు నవరాత్రులలో ప్రయత్నం చేయండి మంచి సంబంధం కుదురుతుంది. స్టాంపింగ్ మరియు వీసా పాస్పోర్ట్ వంటి విషయాలు సానుకూల పడతాయి. ప్రతి రోజు కూడా ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని విస్తరింప చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంతంత మాత్రంగా లాభాలు ఉంటాయి. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. కోర్టు కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం చెప్పదగిన విషయం. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యం స్వామి వారికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు గ్రీన్.
తుల: తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ పరంగా మీకు రావలసిన బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. సినీ పరిశ్రమంలో మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. వ్యాపార పరంగా చక్కగా రాణించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారు కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు పాటించండి. సొంత నిర్ణయాలు కలిసి రావు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఆశాజనకంగా ఉండవు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసే వచ్చే రంగు బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన ఏదైతే ఉందో ప్రస్తుతం విరమించుకోవడం మంచిది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార పరంగా కొంతమందికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు పనికిరాదు. కొన్ని అనివార్య కారణాల వలన ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆదరణ పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్వామి అండదండలు మీకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయించండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీరు ఆశించిన పురోగతి లభిస్తుంది. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసే పనులు విజయవంతంగా సాగుతాయి. పదిమంది సలహాలు సూచనలు తీసుకొని చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కాబట్టి పితృ కార్యక్రమాలను నిర్వహించండి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. అలాగే అరటినారవత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ
మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది జాగ్రత్త వహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పాపులేషన్ కి స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారసత్వ సంపద లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతానం విద్యా పరంగా రాణిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు కాషాయం.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి పంపకాల విషయాలలో కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి కాస్మోటిక్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి లాభాలు బాగున్నాయి. ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. మహాలయ పక్షాలు ముగిసిన తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. జాగ్రత్త వహించండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శని బలంగా ఉన్నారు. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తోంది. పది మంది బాగు కోసం మీరు పాటుపడతారు. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను ఇస్తాయి. విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు ప్రతినిత్యం శని అష్టోత్తరాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. వివాహానికి సంబంధించిన విషయాలు మహాలయ పక్షాలు ముగిసిన తర్వాత ప్రారంభించండి. ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సహ ఉద్యోగుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.