హైదరాబాద్: ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకును మెప్పించిన తేజీ సజ్జా (Teja Sajja).. ఇఫ్పుడు హీరోగా వెండితెరపై దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘హను-మాన్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న తేజా రీసెంట్గా ‘మిరాయ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. రాక్‌స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. అనే విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
‘మిరాయ్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు వసూలు చేసిందని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని షేర్ చేసిన తేజా (Teja Sajja) ‘మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్’ అని పేర్కొన్నాడు. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ ‘మిరాయ్’ గ్రాండ్ సక్సెస్ సాధించింద. ఓవర్సీస్లో తొలి రోజు.. 7 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : విజువల్ వండర్ మిరాయ్’