- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం అని అన్నారు. ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబునల్ విచారణ దృష్ట్యా సమీక్షించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, నీటి పారుదల రంగనిపుణులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..811 టిఎంసిల కృష్ణా జలాల్లో 71 శాతం డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని, తాగు, సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు చేపడతామని అన్నారు. ట్రైబ్యునల్ విచారణ సమయంలో సిఎం రేవంత్ రెడ్డి డిల్లీకి వచ్చి సమీక్షిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : మహిళలకు జిమ్ అవసరమా?
- Advertisement -