Saturday, September 13, 2025

అలా చేస్తే.. పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుంది: సాయి దుర్గ తేజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి చిన్నా, పెద్ద తేడా లేకుండా దానికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఇన్‌స్టా, ఎక్స్‌ల వల్ల చెడు కంటెంట్‌ చూసి.. తప్పుదారి పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం జరగాలంటే.. చిన్న పిల్లల ఎక్స్, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్ కార్డు నెంబర్‌ల కోసం అనుసంధానం చేయాలని హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) అభిప్రాయపడ్డారు. అభయం మసూమ్-25లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కూడా భయం పెరుగుతుందని అన్నారు.

సోషల్‌మీడియాలో అశ్లీలత గురించి మొదటిసారి మాట్లాడినప్పుడు తల్లిదండ్రులను హెచ్చరించానని. ఎందుకంటే వాస్త ప్రపంచం వేరుగా ఉంటుందని సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) అన్నారు. ‘‘వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. అలాంటి పోస్ట్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పోలీస్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేశాను. అశ్లీలతను వ్యాప్తి చేస్తున్నవారికి కూడా రేపు పిల్లలు పుడతారు కదా.. వారి గురించి కూడా ఇలాగే మాట్లాడుతారా? అసలు వాళ్లకు నైతికత ఉందా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి పోస్ట్‌లకు వందల మంది కామెంట్, లైక్స్ చేయడం అత్యంత విచారకరం అని సాయి దుర్గ తేజ్ అన్నారు. ‘‘భారతీయులమై ఉండి, సమాజం పట్ల ప్రవర్తించాల్సి తీరు ఇదేనా? అలాంటి వ్యాఖ్యలపై ఎవరైనా ప్రశ్నిస్తారా అని 24 గంటలపాటు ఎదురుచూశా. కానీ, ఒక్కరూ ప్రశ్నించలేదు. వార్తలు రాలేదు. అందుకే నేను బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. డార్క్ కామెడీ అని చెప్పి ఇలాంటివి మాట్లాడతారా? ఇతరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడ ఉంది’’ అని ప్రశ్నించారు.

Also Read: ‘మిరాయ్’ హిట్టా.. ఫట్టా..? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News