దుబాయ్: ఆసియాకప్‌ను భారత్ (Team India).. భారీ విజయంతో ప్రారంభించింది. యుఎఇతో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా నెగ్గింది. ఇప్పుడు భారత చిరకాల శతృవు పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఇరు దేశాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్రాంకో టెస్ట్‌ను ఆటగాళ్లకు పరిచయం చేసిన బిసిసిఐ ఇప్పుడు ఫీల్డింగ్‌లోనూ నూతన టెక్నిక్‌ని ప్రవేశపెట్టింది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఈ ఫీల్డింగ్ డ్రిల్‌ను ఆటగాళ్లకు పరిచయం చేశారు. దీని వల్ల ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడి పరుగులు ఆపడమే కాకుండా.. కీలక పోరులో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఈ డ్రిల్స్‌ని నిర్వహించారు. ఇందులో రింకు సింగ్ టాపర్‌గా నిలిచాడు.. అతడికి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మెడల్ కూడా అందించారు.
ఈ డ్రిల్ ఎలా ఉంటుందంటే.. ఇందులో ప్రతీ ఆటగాడు (Team India) వేగంగా కదలాలి. వారికి కేటాయించిన గోల్స్‌ను పూర్తి చేయాలి. రెండు సెట్లలో ఐదేసి క్యాచుల చొప్పున ఆందుకోవాలి. గార్డ్స్‌ను మారుస్తూ ముందుకు సాగాలి. అయితే హార్థిక్ పాండ్యా ఈ డ్రిల్‌లో మొదటి క్యాచ్‌ని మిస్ చేసినా.. ఆ తర్వాత అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. శివమ్ దూబె ఆకట్టుకున్నాడు. శుభ్‌మాన్ గిల్, రింకూ సింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. నాలుగు క్లిష్టమైన క్యాచ్‌లను గిల్ అందుకున్నాడు. తొలి సెట్లో కాస్త ఇబ్బంది పడిన రింకు.. ఆ తర్వాత రెండో సెట్లో పుంజుకున్నాడు. చివరికి అతడే విజేతగా నిలిచి మెడల్ అందుకున్నాడు.
Also Read : బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..