Saturday, September 13, 2025

కాళేశ్వరం నుంచి బయటపడేందుకు ప్రధాని మోడితో కెటిఆర్‌ కాళ్ళ బేరం

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై సిబిఐ విచారణ నుంచి బయట పడేందుకు బిఆర్‌ఎస్ ప్రధాని నరేంద్ర మోడితో కాళ్ళ బేరానికి దిగిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటింగ్‌కు హాజరుకాలేదని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. సిబిఐ కేసు నుంచి తప్పించుకునేందుకు కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు ఢిల్లీలో ప్రధాని మోడి, కేంద్ర హోం మంత్రి అమీత్ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా చుట్టూ తిరిగింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. మీ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటే, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ కుటుంబం సర్వ సంపదనూ దేశం కోసం త్యాగం చేసిందన్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని తాను అనడం కాదు ఇటీవల కెటిఆర్ సోదరి కవిత అన్నారని ఆయన గుర్తు చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి రెండూ వేర్వేరు కాదని అవి మానసికంగా విలీనం అయినట్లేనని అన్నారు.

కెటిఆర్ స్థాయిని మించి ..
కెటిఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాహుల్ గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. కెటిఆర్ శకం, బిఆర్‌ఎస్ శకం ముగిసిందన్నారు. ఫార్మూలా ఈ కార్ రేసింగ్‌లో దొరికారని అన్నారు. మనువాద రాజ్యాంగం తేవాలనుకుంటున్న బిజెపికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరోక్షంగా మద్దతునిచ్చిందని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్న బియ్యం, విద్యార్థులకు స్కాలర్ షిప్, మెస్ ఛార్జీల పెంపు, రైతు భరోసా వంటి అనేక పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పేదవాడు ఉండకూడదన్న లక్షంతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డుల కోసం 40 లక్షల దరఖాస్తులు వస్తే ఒక్కటీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మిగతావి కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలే తమకు శిరోధార్యం అని అన్నారు.

Also Read: మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పడుకున్నారా?
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే 48 గంటల్లో తేల్చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పడుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. సిబిఐకి అప్పగించి ఇన్ని రోజులైనా ఎందుకు మాట్లాడడం లేదని ఆయన కేంద్ర మంత్రిని ఉద్ధేశించి ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేల జవాబే ముఖ్యం
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ స్పీకర్ నోటీసుకు సంబంధిత ఎమ్మెల్యేలు ఏమి జవాబు చెప్పుకుంటారో అన్నదే ముఖ్యం తప్ప తాను చెప్పిందో లేక మరొకరు చెప్పిందో పరిగణలోకి రాదన్నారు. ఇది పూర్తిగా స్పీకర్ పరిథిలోని అంశం అని ఆయన అన్నారు. కండువా కప్పడం అనేక అనాదిగా సంప్రదాయంగా వస్తున్నదని ఆయన తెలిపారు. తాను గ్రామానికి వెళితే అభిమానులు, కార్యకర్తలు తమకు తోచిన కండువా కప్పుతారని అంత మాత్రాన తాను ఆ పార్టీకి చెందిన వాడిని అవుతానా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడం కొత్తేమి కాదన్నారు. అలాగైతే కెటిఆర్, హరీష్ కూడా ప్రధానిని, బిజెపి నేతలను కలిసినందున ఆ పార్టీలో చేరారని ఫిర్యాదు చేస్తామని అని ఆయన అన్నారు.

కోట నీలిమపై రాజకీయ కక్ష
ఓట్ చోరీ బండారాన్ని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బయట పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తమ పార్టీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ 2017 చిరునామా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫామ్6 ఇచ్చినా ఈసి చర్యలు తీసుకోలేదని, పైగా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కక్షపూరితంగా వ్యవహారించారని ఆయన విమర్శించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News