Saturday, September 13, 2025

దేశానికి అన్నం పెట్టే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా..?:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతులపై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేసావు..నేడు బస్తా యూరియా కోసం పోలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తెచ్చావు అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా…? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నారని, అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదు అని పేర్కొన్నారు. రైతులను నేరస్తులుగా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టిన రేవంత్‌రెడ్డి దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, తగిన సమయంలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

Also Read:  కాళేశ్వరం నుంచి బయటపడేందుకు ప్రధాని మోడితో కెటిఆర్‌ కాళ్ళ బేరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News