- Advertisement -
బిసిలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే బిల్లును కేంద్రం ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్లలో బిసి మహిళలకు సబ్ కోటా డిమాండ్లతో ఈనెల 24న ట్యాంక్ బండ్ వద్ద వేలాదిమంది బిసి మహిళలతో బిసి బతకమ్మ నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణిమంజరి సాగర్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బిసి భవన్లో బిసి మహిళా సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళలు పూల పండుగను కోరిన కోరికలు నెరవేర్చడానికి ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారని, ఇప్పుడు బిసిల ప్రగాఢ ఆకాంక్ష అయిన బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదం, మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలనీ ప్రధాని నరేంద్ర మోడీ మనసు కరిగి బిసిల ఆకాంక్షలు నెరవేర్చాలని బిసిల బతుకమ్మను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: మహిళా స్వయం సంఘాలకు దసరా జోష్
జనాభాలో సగభాగానికి పైగా బిసిలు ఉంటే అందులో సగభాగ0 బిసి మహిళలు ఉన్నారని, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బిసి రిజర్వేషన్లు పెరిగితే బిసి మహిళలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు దక్కుతాయని దీంతో వెనకబడిన బిసి మహిళలకు సాధికారత దక్కుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మణిమంజరి మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల పెంచాలని బిసిలు గత 22 నెలలుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో అగ్రకుల దొరల స్థానములో దొరసానులు వస్తారే తప్ప బడుగు మహిళలకు అవకాశాలు రావని ఆమె అన్నారు. చరిత్రలో మొదటిసారిగా బిసి డిమాండ్ల సాధన కోసం బిసిల బతుకమ్మ ద్వారా బిసిల గొంతుకను వినిపిస్తామని, రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ బిసిల బతుకమ్మలు వేలాదిమంది బిసి మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్
ముదిరాజ్, బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, కార్యనిర్వాక కార్యదర్శిలు ఏ సంధ్య రాణి, కే సుజాత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సిద్ధాంతం శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -