Saturday, September 13, 2025

మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు

- Advertisement -
- Advertisement -

వయనాడ్: జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అందరు ప్రధానులు ఇదే పాటించారని తెలిపారు. కానీ మోడీ మాత్రం రెండేళ్ల తర్వాత దీన్ని దీన్ని పాటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికే అక్కడ పర్యటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇక మోడీ పర్యటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న మోడీ మిజోరం రాజధాని ఆయిజోల్ కేంద్రంగా రూ.8071కోట్లతో కొత్తగా నిర్మించిన 51.38 కిమీ పొడవైన రైలు కారిడార్‌ను ప్రారంభించారు. ఈ పర్యటన దృష్టా మణిపూర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News