Sunday, September 14, 2025

‘జూబ్లీ’ రేసులో నేనూ ఉన్నా: మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీలో రోజు రోజూకూ పోటీ పెరుగుతున్నది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను రేసులో ఉన్నానని సికింద్రాబాద్ నియోజకవర్గం మాజీ లోక్‌సభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శనివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. తాను సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు ఎంపిగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి పార్లమెంటు సభ్యులకు ఉండే ఎంపీల్యాడ్స్ నిధులు అధికంగా ఖర్చు చేశానని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటితో తనకు అనుబంధం ఉందన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. అంతేకాకుండా తాను విజయం సాధించిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానం కల్పించాలని ఆయన కోరడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.

Also Read: 68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News