Sunday, September 14, 2025

ప్రజలు మిమ్ముల్ని విశ్వసించరు: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవని, గద్వాలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఎంత గొంతు చించుకున్నా, బట్టలు విప్పుకున్నా ఫలితం ఉండదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్లు కెటిఆర్ తీరు ఉందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో 39 మంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోగోడు అయితే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలంటున్న కెటిఆర్ ఆరోజు మగతనం, దమ్ము ఎక్కడికి పోయిందని అద్దంకి ప్రశ్నించారు. ముగ్గురు ఎంపీలు,

16 మంది ఎమ్మెల్సీలను బిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు కెటిఆర్‌కు ఈ సంగతులు తెలియవా ? సిఎం రేవంత్ రెడ్డి నిజంగానే మొగోడు, దమ్మున్నోడు కాబట్టే తొడకొట్టి మిమ్ముల్ని ఓడించి ఫామ్ హౌస్ కు పంపించాడని తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడి పబ్బం గడుపుకోవడమే కెటిఆర్ పని అన్నారు. దాదాపు రెండేళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ విఫలం అయ్యారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ కూడా విఫలం అయ్యారని అన్నారని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ తప్పుడు పనులు చేసి ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడితే ప్రజలు వారికి గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణను వంచించిన మిమ్ముల్ని ప్రజలు ఏనాడు విశ్వసించరని తెలిపారు.

Also Read: జిడిపిలో ఎంఎస్‌ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News