Sunday, September 14, 2025

ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం, గొల్లబుద్ధారం ఎస్‌టి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులకు శనివారం విద్యుత్ షాక్ తగిలింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులను చెట్టెక్కి కొమ్మలు కొట్టాలని చెప్పగా.. వారు కొమ్మలు కొడుతుండగా ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న రాజేందర్ అనే విద్యార్థికి తీవ్ర గాయమైంది. బాలుడిని జిల్లా కేంద్రంలోని ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలపాలైన మరో విద్యార్థిని హాస్టల్లోనే చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News