Sunday, September 14, 2025

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మిరాయ్’

- Advertisement -
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా థాంక్ యూ మీట్ నిర్వహించారు.

ఈ వేడుకలో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. “ఈ సినిమాని గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన స్పందన చాలా ఆనందాన్నిచ్చింది. డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మనోజ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. రితికా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు ప్రయాణించింది. హరి గౌరా మ్యూజిక్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది”అని అన్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నిన్నటి నుంచి అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు. విశ్వప్రసాద్ అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. తమ్ముడు తేజ మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు. రితిక అద్భుతంగా చేసింది”అని తెలిపారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో మిరాయ్ లాంటి అద్భుతమైన విజయం మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. ఈ సినిమాని మా దగ్గరికి తీసుకు వచ్చిన డైరెక్టర్ కార్తీక్‌కి ఈ క్రెడిట్ ఇస్తాను. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే తేజా లాంటి కమిట్‌మెంట్ ఉన్న హీరోతో చేయాలనుకుని అనుకున్నాం. కార్తీక్, తేజ, మనోజ్ అద్భుతంగా పనిచేశారు. మా అమ్మాయి కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం” అని తెలియజేశారు. డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. “2021లో ఈ సినిమా ఐడియా చెప్పాను తేజకి. అప్పటినుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను నమ్మిన నిర్మాత విశ్వప్రసాద్‌కి థాంక్యు. మనోజ్‌తో కలిసి షూట్ చేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. జగపతి బాబు, జయరాం, శ్రియాలకు స్పెషల్ థాంక్స్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రితిక నాయక, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా పాల్గొన్నారు.

Also Read: అలా చేస్తే.. పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుంది: సాయి దుర్గ తేజ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News