హైదరాబాద్: అనారోగ్య సమస్యలు ఉన్నాయని కుమారుడిని కన్నతండ్రి చంపేసి మూట కట్టి మూసీలో పడేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం బండ్లగూడ (Old city area Bandlaguda) పోలీస్ స్టేషన్ పరిధిలలో జరిగింది. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి బండ్లగూడలో నివసిస్తున్నాడు. అతడికి అనారోగ్య సమస్యలతో ఉన్న కుమారుడు ఉన్నాడు. దీంతో కుమారుడు చంపి అనంతరం సంచిలో మూటకట్టాడు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీలో పడేశాడు. ఆపై ఏమీ తెలియదన్నట్లు బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అతడిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. బాలుడి మృతదేహం కోసం బండ్లగూడ పోలీసులు, హైడ్రా, ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బంది. గాలింపు చర్యలు చేపట్టింది.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
Old city area Bandlaguda