Sunday, September 14, 2025

నా మెదడు విలువ రూ.200 కోట్లు.. ఆ పని రైతుల కోసమే చేశా: గడ్కరీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆలోచిస్తామని, తమ జేబులు నింపుకోవడానికి కాదని కేంద్ర రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో నితిన్ గడ్కరీ స్పందించారు. శనివారం నాగ్‌పూర్‌లోని అగ్రికోస్ వెల్పేర్ సొసైటి నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ ప్రసంగించారు. తాను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని ప్రజలు అనుకుంటున్నారా?, నిజాయతీతో ఎలా సంపాదించాలో తనకు తెలుసునని వివరించారు. తన మెదడు విలువ (Gadkari mind value) నెలకు రూ 200 కోట్లు అని, డబ్బులకు ఎలాంటి లోటు లేదన్నారు. తనకు కుటుంబం ఉందని, తాను సాధువును కాదు అని, రాజకీయ నాయకుడినని, రైతుల మంచి కోసమే తాము ఈ పని చేశామని గడ్కరీ వివరించారు.

Also Read:  సమరానికి సర్వం సిద్ధం.. నేడు పాక్తో భారత్ పోరు

ఇ20 ఇంధనం వాడకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. ముడి చమురు దిగుమతులు, వాహన ఉద్గారాలను తగ్గించడం కోసమే ఇథనాల్‌ను తీసుకొచ్చామని, ఇంధన భద్రతతో పాటు పర్యావరణ సంరక్షణ వంటి లక్ష్యాలను చేరుకోవడానిక ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని కోర్టు తెలియజేసింది. ఇ20 పెట్రోల్ పాత వాహనాల సామర్థాన్ని దెబ్బతీసుందా? డ్రైవింగ్ దెబ్బతీస్తుందా? అని గతంలో సోషల్ నెటిజన్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Gadkari mind value

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News